Site icon NTV Telugu

Vikramarka: మోడీ, బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలి.. సీఎంను బర్తరఫ్ చేయాలి

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. క్రమంగా సీఎంను బర్తరఫ్‌ చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.. ఈ అంశంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భట్టి… అస్సాం సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. దేశ సంస్కృతికి విరుద్ధంగా బీజేపీ ముఖ్యమంత్రి శర్మ చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనాయకత్వం వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read also: IPL 2022 Auction: భారత ప్లేయర్లకు కాసుల పంట

దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి శర్మ.. ఇదేనా నీ పార్టీ నీకు నేర్పిన సంస్కృతి, మీ సంస్కారం అంటూ నిప్పులు చెరిగారు. ఇదేనా.. బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన వ్యక్తులున్న బీజేపీ ఈదేశాన్ని పాలించడం సిగ్గుగా ఉందని మండిపడ్డారు.. బీజేపీకి అమ్ముడు పోయి ఆ పార్టీ అధిష్టానం మొప్పు కోసం రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్తులో కమలం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు మల్లు భట్టి విక్రమార్క.

Exit mobile version