Site icon NTV Telugu

Minister Uttam Kumar: పాలమూరు జిల్లాను గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది..

Uttam

Uttam

Minister Uttam Kumar: ఎస్ఎల్బీసీ టన్నెల్ సంఘటన దురదృష్టకరం అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బాధ్యతగా ఆ కుటుంబ సభ్యులను ఆదుకుంటాం.. దొరకని ఆరు మృతదేహాలు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం.. ప్రభుత్వపరంగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాం.. జియో లాజికల్ సర్వే సూచన మేరకే రెస్కూ ఆపరేషన్ నిలిపివేశాం.. ఆరు మృతదేహాల ఘటన స్థలంలో క్రిటికల్ కండిషన్ ఉంది, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో పనులు ఆపేశాం.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పూర్తి కోసం హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశామన్నారు. 2026 మార్చి 31వ తేదీ వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు.

Read Also: ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఒక్క ఏప్రిల్లోనే 21 కేసులు..

అయితే, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో కృష్ణా నది జలాల కేటాయింపులో పాలమూరు, నల్లగొండకు తీరని అన్యాయం జరిగింది అన్నారు. 819 టీఎంసీల కృష్ణ జలాలను ఆంధ్రకు కేటాయిస్తుంటే.. కేసీఆర్ సర్కార్ చోద్యం చూసిందన్నారు. 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వాటా దక్కింది.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారు.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మరో రెండు ఏళ్లలో పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version