BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Party: మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే అభిమాని బీఆర్‌ఎస్ పార్టీలో ఎలా చేరాలని ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీనిపై కవిత స్పందిస్తూ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ కు మద్దతు తెలపాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ విధానాలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని సాగర్ అన్నారు. ఇటీవల నాందేడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ మహారాష్ట్ర ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపిందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నదే అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సాగర్ అనే అభిమాని చేసిన ట్విట్ కు ఎమ్మెల్సీ కవిత ట్యాగ్ చేస్తూ రిప్లై ఇవ్వడంతో.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
DM your contact details. We are happy to welcome you 😊 #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023
అయితే… కవిత ఈ నెల 25న ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 పేరిట జరిగే సదస్సులో ఎమ్మెల్సీ పాల్గొంటారు. 2024 ఎన్నికలు-ప్రతిపక్ష వ్యూహం అనే అంశంపై జరిగే చర్చలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. బీఆర్‌ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా వంటి పథకాల ప్రాధాన్యతను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. ఈ సదస్సులో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ పాల్గొనున్నారని సమాచారం.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!