Ramachandru Nayak: పిచ్చెక్కి మాట్లాడుతుండు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎమ్మెల్యే ఫైర్
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతుండు- రామచంద్రు నాయక్
- కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తుండు- రామచంద్రు నాయక్
- దళిత, గిరిజన బహుజ బిడ్డలను మోసం చేశాడు- రామచంద్రు నాయక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నాడు.. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని దుయ్యబట్టారు. ఆయనకు తలపై వెంట్రుకలే కాదు.. లోపల బ్రెయిన్ కూడా లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడు.. అందుకే ఫార్ములా ఈ కార్ రేసులో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని అంటున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ గడీలు, ఫామ్ హౌస్ బద్దలు కొడతామన్న ఆయన.. ఈ రోజు వాళ్ళు మీకు మంచి అయ్యారా..? అంటూ మండిపడ్డారు.
Read Also: DeepSeek: అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమేనా ? డీప్ సీక్ జవాబు ఇదే !
Also Read
బీఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ నిధులు ఏ విధంగా స్వాహా చేసిండో అందరికి తెలుసని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మిమ్మల్ని నమ్మిన దళిత, గిరిజన బహుజ బిడ్డలను మోసం చేశాడని తెలిపారు. కేసీఆర్ ఇచ్చే డబ్బుకు కక్కుర్తి పడి పార్లమెంట్ సీటు కోసం నమ్ముకున్న దళిత బహుజన బిడ్డలను నట్టేట ముంచారని ఆరోపించారు. పోలీసు అధికారిగా స్వెరోస్ స్థాపించి ఏ విధంగా గురుకులాలను బ్రష్టు పట్టించాడో తెలుసని ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేర్కొన్నారు.
Read Also: Kissik Song: కిస్సిక్ సాంగ్ కి ఒక్కరోజే ప్రాక్టీస్.. వాళ్ళు ప్రొఫెషనల్స్ అబ్బా!
కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో ఎలాంటి అనుమతి లేకుండా విదేశాలకు తరలించారు.. సీఎం రేవంత్ రెడ్డి కారణంగానే ఫార్ములా ఈ కార్ రేసులో రాష్ట్రానికి నష్టం వచ్చిందని సిగ్గులేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. అహర్నిశలు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం కష్టపడి పని చేస్తున్నారు.. ఇప్పటికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రామచంద్రు నాయక్ సూచించారు. లేదంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!