NTV Telugu Site icon

Harish Rao: అందరికి రుణమాఫీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం..

Harish Rao

Harish Rao

Harish Rao: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతులకు రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ కావాలని నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది అని విమర్శించారు. డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదు.. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు.. కేసీఆర్ ది రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి.. 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జూట సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుబడిపోయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read Also: Kerala: టేకాఫ్‌కి ముందు విమానంలో పొగలు.. ఫ్లైట్ లో142 మంది ప్రయాణికులు..

ఇక, మూసి ప్రక్షాళన చేయాలంటే గోదారి నీళ్లతో ప్రక్షాళనల చేయ్యు అని హరీష్ రావు అన్నారు. కానీ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల ఇండ్లను కూలిస్తే ఊరుకునేది లేదు అని మండిపడ్డారు. దసరాలోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయకపోతే.. దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేపడతామని మాజీ మంత్రి సవాల్ విసిరారు. రుణమాఫీ చేయమంటే రోజుకోక డైవర్షన్ తో కాలయాపన చేస్తున్నారు.. రైతు రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఒకటి మంత్రుల వైఖరి ఒకటి… ఏది నమ్మాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన ఎద్దేవా చేశారు. రైతులు పండించే ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి.. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు వచ్చే ఎమ్మెల్యేలను రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయండి అని హరీష్ రావు పిలుపునిచ్చారు.