మూసీ కాల్వలో మురికి ఎంతనో.. టీఆర్‌ఎస్ నేతల అవినీతి అంత : మధుయాష్కీ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్‌ఎస్ ఫ్లీనరీ సమావేశంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయింది. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కాల్వలో మురికి ఎంతుందో.. టీఆర్‌ఎస్ నేతల అవినీతి అంతలా పేరుకుపోయిందన్నారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు.. ఎందుకు విదేశీ వ్యాపారం పై రైడ్స్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఏడేళ్ల కాలంలో ఆత్మహత్యలు ఆగలేదని, నిరుద్యోగ యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. దేశంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న స్థానాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నా కేసీఆర్‌కు సోయి లేదని మధు యాష్కీ అన్నారు.
Also Read
- CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
- CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
- Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
సీఎం కేసీఆర్ స్వంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని, కోటి ఎకరాల మాగాణి అంటూ.. వరి వేస్తే ఉరి అని ఎందుకు అంటున్నారని మధు యాష్కీ ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడింది.. అందులో కేసీఆర్ గొప్పతనం ఏమీ లేదు, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనకుంటే.. గొర్రెలు, బర్రెలు అంటున్నారన్నారు. రాహు కాలం.. రావుల కాలంలో ఏమీ రావన్నట్లు పరిస్థితి తయారైందని, ఇక టీఆర్‌ఎస్ వీఆర్‌ఎస్ పలకాల్సిన సమయం వచ్చిందని మధు యాష్కీ అన్నారు.
- Tags
- congress
- kcr
- Madhuyashki
- TRS
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!