NTV Telugu Site icon

హరీష్‌రావు, ఈటలపై మధుయాష్కీ ఆసక్తికర వ్యాఖ్యలు

Madhu Yashki Goud

Madhu Yashki Goud

మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ గౌడ్‌… జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నమ్ముకొని ఈటల రాజేందర్ మోసపోయారని గమనించాలని సూచించారు.. ఇక, రబ్బరు చెప్పులు కూడా లేని హరీష్ రావుకు వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో దొంగ నోట్లు పంచిన కేసు ఉండే అని కామెంట్‌ చేసిన యాష్కీ.. ఇప్పుడు దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తూ అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టారంటూ ఫైర్‌ అయ్యారు.. హుజురాబాద్ ఉపఎన్నికలు వాయిదాపై స్పందిస్తే.. ఎన్నికలకు వాయిదా వేస్తే టీఆర్ఎస్‌ గెలుస్తుందని కేసీఆర్ నమ్మకమంటూ సెటైర్లు వేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన వారి కుటుంబాలకు అదుకొని రాక్షసుడి కేసీఆర్ అంటూ ఫైర్‌ అయిన మధుయాష్కీ… కృష్ణనది జలాల గురించి ప్రధాన మంత్రితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రతి సారి 50 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేస్తానని ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు తాగిన మైకంలో కళలు కంటాడని ఎద్దేవా చేశారు. ఇక, రూ. 150 కోట్లతో ఎమ్మెల్సీ కవిత ఇల్లు కట్టుకుంది.. కానీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఒక్కటైన ఇవ్వలేదని ఆరోపించారు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేసింది.. జీవన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు మధుయాష్కీ గౌడ్‌.