ప్రభుత్వం జూనియర్, డిగ్రీ లెక్చర్‌లను అడ్డగోలుగా కేటాయించారని ఇంటర్ విద్యా జాక్ చైర్మన్ మధు సూదన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన జోన్ల ప్రకారం లెక్చరర్లను కేటాయింలేదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. మల్టీ జోన్ -1 కి 130 మంది జూనియర్ లెక్చరర్ లను, 78 మంది డిగ్రీ లెక్చరర్‌లను నిబంధనల ప్రకారం కేటాయించలేదని తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 6 వేల పోస్ట్‌లకు 725 మందే పనిచేస్తున్నారు… వీరిలో చాలా మందిని ఇష్టమొచ్చినట్టు కేటాయించిందన్నారు. సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. ఉద్యోగుల బదీలీల్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. ఒకే చోట పనిచేస్తున్న భార్య భర్తలు వర్వేరు మల్టీజోన్‌లకు కేటాయించారన్నారు.