Arya 34: పలు విజయవంతమైన చిత్రాలను అందించిన జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థల సంయుక్త నిర్మాణంలో ‘ఆర్య 34’ వర్కింగ్ టైటిల్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రారంభించారు. యూనిక్ కథలతో టెడ్డీ, సార్పట్ట పరంపర, కెప్టెన్ వంటి చిత్రాలలో నటించిన ఆర్య ఇందులో హీరో. పలు తెలుగు సినిమాలతో పాటు శింబు తాజా చిత్రంలో నటించిన సిద్ధి ఇద్నాని ఈ చిత్రంలో హీరోయిన్.
ఈ చిత్రం గురించి జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఆర్య కథానాయకుడిగా ముత్తయ్య దర్శకత్వంలో డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఆర్య తన వెర్స్ టైల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముత్తయ్య ప్రేక్షకుల పల్స్‌ను తెలుసుకున్న దర్శకుడు. వీరి కలయిక ప్రేక్షకులకు వినోదాత్మక చిత్రాన్ని అందించడం ఖాయం. గతంలో గొప్ప కంటెంట్‌ను అందించిన డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్‌తో కలిసి ప్రేక్షకులకు గొప్ప కంటెంట్‌ను అందించాలని ఆశిస్తున్నాం అని అన్నారు.
Bigg boss 6 : చలాకీగా లేకపోవడమే అతని ఎలిమినేషన్‌కు కారణమా!?
ఇటీవల విడుదలైన ‘విరుమాన్’తో సహా గ్రామీణ నేపధ్యంలో కమర్షియల్‌గా విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అందించడంలో పేరు తెచ్చుకున్న ముత్తయ్య ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వేల్‌రాజ్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, వీరమణి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.