Hyderabad Old City Protests: రాజాసింగ్ బెయిల్ పై హీటెక్కిన పాతబస్తీ.. భారీ భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Old City Protests: BJP MLA రాజాసింగ్ కు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఓల్డ్ సిటీ అట్టుడుకుతోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. చార్మినార్ వద్ద ఓ వర్గం యువత భారీగా చేరుకుని పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో వారు లాఠీఛార్జ్ చేశారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులు, పారా మిలటరీ దళాలు భారీగా మోహరించారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని నగర ప్రజలు భయపడుతున్నారు.
దీంతో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తునన గోషామహల్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు. సిటీ కాలేజీ చౌరస్తాలో భారీకేడ్లను అడ్డంపెట్టి, అటు వైపుగా ఎవరినీ వెళ్లనీయడం లేదు. మూసాభౌలీ, హుస్సునీ ఆలం, చార్మినార్, శాలిబండ నుంచి ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. సిటీ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సిటీకాలేజీ నుంచి బేగంబజార్, హైకోర్టు వెళ్లే రహదారులను మూసి వేశారు. పాతబస్తీలోని ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజాసింగ్‌కు బెయిల్ ఎందుకు ఇచ్చారని ఆందోళనకారులు మండిపడ్డారు. కాగా.. దక్షిణ మండల డీసీపీ, అదనపు డీసీ పీ, ఎస్బీ అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులు సమీక్షిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!