తెలంగాణలో ఏ పండుగ వచ్చినా చుక్కా, ముక్కా ఉండాల్సిందే.. మంచు, చెడు ఏదైనా చుక్క పడాల్సిందే.. ఇక, దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఎందుకంటే.. దసరాకు వాహన పూజల నుంచి పనిచేసే దగ్గర పూజలు, యాటలు కోయడం.. ఇలా పెద్ద హంగామే ఉంటుంది.. ఈ సమయంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది… ఎప్పుడూ ఒక్కసారి ఊరికి వచ్చేవారు సైతం.. దసరాకు తప్పకుండా విలేజ్‌లో అడుగు పెడతారు.. పాత మిత్రులు, కొత్త దోస్తాన్ అలా సెలబ్రేట్ చేసుకుంటారు.. అందరినీ కలిసి ఓ పెగ్గు వేస్తుంటారు.. ఇదంతా ఇప్పుడెందుకంటే.. దసరా ముందే లిక్కర్‌కు కిక్కు ఎక్కింది.. పండగకు వారం రోజుల ముందే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.. సాధారణ రోజుల్లో నిత్యం రూ.60-90 కోట్ల విలువైన విక్రయాలు సాగుతుండగా.. ప్రస్తుతం మద్యం డిపోల నుంచి లిక్కర్ షాపులకు రోజుకు రూ.100 కోట్లకుపైగా మద్యం తరలిపోతున్నట్టు ఎక్కైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి..
Read Also: Munugode Bypoll: మునుగోడులో బీజేపీకి బిగ్ షాక్..!
ఈ మధ్య జరిగిన విక్రయాలను ఓసారి పరిశీలిస్తే.. ఈ నెల 26న రూ.174.55 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగగా.. 27న రూ.123.93 కోట్లు, 28న రూ.117.02 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగాయి.. దసరాకు సమయం దగ్గర పడడంతో.. ఇది క్రమింగా పెరిగే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు.. కరోనా కారణంగా 2020, 2021లో మద్యం విక్రయాలపై ప్రభావం పడగా.. ఈసారి అది కనిపించడం లేదు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో రూ.3,300 కోట్లకు పైగా అదనపు విక్రయాలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మొత్తంగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రూ.25,223.58 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.. ఇది దసరా పండుగ ముగిసేసరికి రూ.26 వేల కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. అక్టోబర్, నంబర్, డిసెంబర్.. ఈ మూడు నెలలు మిగిలే ఉన్నాయి.. ఇక, డిసెంబర్ 31 మద్యం విక్రయాల్లో ప్రత్యేకంగా నిలుస్తూ వస్తుంది.. ఇలా లెక్కలు వేసుకుంటే.. ఈ ఏడాది మద్యం విక్రయాలు రూ.35 వేల కోట్లు దాటవచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారట.