Leopard in Jeedimetla: జీడిమెట్లలో చిరుత ఆనవాల్లు.. భయాందోళనలో కాలనీ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard in Jeedimetla: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అపురూప కాలనీలో చిరుత సంచరిస్తున్న వీడియో క్లిప్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాలనీలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలను రికార్డు అయ్యాయి. చిరుత సంచరిస్తోందంటూ వీడియో బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మున్నా బోరంపేట, అపురూప కాలనీలో ఈరోజు చిరుత జాడలు చూసి హడలెత్తిపోయారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతూ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రిపూట బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. చిరుత సంచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు కాలనీని సందర్శించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇది చిరుతపులి కాదని, అడవి కుక్క ఆనవాలుగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఈ వీడియోను ఎవరు పోస్ట్ చేశారని ఆరాతీస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు భయభ్రాంతులు చేసే వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చిరుత ఆనవాళ్లు కాదని, అడవి కుక్క ఆనవాల్లుగా ఉన్నాయని ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయవద్దని, ఒకవేళ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
తాజాగా సూర్యాపేట జిల్లాలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. పట్టణంలోని డిమార్ట్ వెనుక నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఎలుగుబంటి లాక్కెళ్లింది. అర్ధరాత్రి కుక్కల అరుపులతో కాలనీ వాసులు భవనంలోకి వెళ్లి చూడగా ఓ మూలన ఎలుగుబంటి కనిపించింది. దీంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓ చిరుత అక్కడి నుంచి మరో ఇంట్లోకి చొరబడి రాత్రంతా అక్కడే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
DOST Admission: నేటి నుంచే దోస్త్ అడ్మిషన్లు షురూ.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!