DOST Admission: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందులో భాగంగా నేటి నుంచి (మంగళవారం) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు శాతవాహన యూనివర్శిటీలో ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు తొలివిడుత ప్రారంభంకానుంది. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది. మొదటి ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్లను జూన్ 16న కేటాయించనున్నారు. మళ్లీ జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో ఖాళీల ఆప్షన్ల ప్రక్రియ 30న రెండో ఖాళీ సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. జూలై 1 నుండి జూలై 6 వరకు మూడవ ఖాళీల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, 10వ తేదీన మూడవ ఖాళీ సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానుండగా.. మూడు ఖాళీలను ఇస్తూ సీట్లు భర్తీ చేసుకునేందుకు ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది.
వివరాలు..
నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల వివరాలను సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించనున్నారు. అందుకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. గతేడాది యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, వాటిలో భర్తీ చేసిన సీట్లు, ఏ కాలేజీకి ఏ కోర్సులో ఎన్ని సీట్లు కావాలనే వివరాలను సేకరించారు. అలాగే కొన్ని కాలేజీలు కొనసాగించాలా..? లేక..? అన్న అంశాన్ని కూడా పరిశీలించి సదరు నివేదికను వీసీ ముందు ఉంచారు. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత అనుమతి పొందిన కాలేజీలు, ఆయా కాలేజీలకు కేటాయించిన సీట్లు నేడు వెల్లడికానున్నాయి. కొన్ని కాలేజీలను మూసివేసేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు అనుమతి కోరిన సంగతి తెలిసిందే.
రిజిస్ర్టేషన్ ప్రక్రియ
విద్యార్థులు దోస్త్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ఎంపిక మరియు అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలో అడ్మిషన్ తీసుకోవచ్చు. దోస్త్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అందుకు విద్యార్థులు ముందుగా తమ ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. విద్యార్థులు https://dost.cgg.gov.in కి లాగిన్ అయినప్పుడు, వారు దోస్త్ ID, PIN నంబర్ పొందుతారు. వీటిని ఉపయోగించి అప్లికేషన్‌ను పూర్తి చేయండి. అందులో కోర్సులు, కాలేజీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. కోరుకున్న కాలేజీలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. కౌన్సెలింగ్ ఏ దశలోనైనా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లు సమర్పించి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎస్సారార్ కళాశాల, కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఉంచి వారికి తోడ్పాటు అందించారు. విద్యార్థులు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. అలాగే తమకు నచ్చిన కోర్సు, కాలేజీని ఎంచుకుని రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉంది.
MP Avinash Reddy: విచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ