Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే లక్డీకాపూల్ జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ విభాగం నడుం బిగించాయి. రవీంద్రభారతి – లక్డీకాపూల్ – ఇక్బాల్ మినార్ కూడళ్ల మధ్య ప్రతిపాదిత ‘వన్ వే’ విధానాన్ని నవంబర్ 22వ తేదీ (ఆదివారం) ఒక రోజు పాటు ప్రయోగాత్మకంగా (ట్రయల్ రన్) అమలు చేయాలని నిర్ణయించాయి.
ఈ నూతన ట్రాఫిక్ విధానం అమలుకు అవసరమైన క్షేత్రస్థాయి ఏర్పాట్లు, రోడ్డు ఇంజినీరింగ్ పనులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వయంగా బైక్‌పై తిరుగుతూ పరిశీలించారు. లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూం, హెచ్డీఎఫ్సీ జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలను ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసింది. వన్ వే విధానంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు జంక్షన్ల రీ-డిజైనింగ్, రోడ్డు విస్తరణ పనులతో పాటు భారీ ఇంజినీరింగ్ మార్పులు చేపట్టాలని నిర్ణయించారు.
Also Read
- Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
- CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
- Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
- Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు ఇవే:
రూట్-1: ఓల్డ్ కంట్రోల్ రూం వైపు నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్ మినార్ వైపు నేరుగా వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ మార్గంలో వచ్చే వాహనాలను రవీంద్రభారతి వద్ద మళ్లించి.. హెచ్డీఎఫ్సీ జంక్షన్, పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ మీదుగా సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు అనుమతిస్తారు.
రూట్-2: నిరంకారి జంక్షన్ వైపు నుంచి హెచ్డీఎఫ్సీ, రవీంద్రభారతి మీదుగా ఓల్డ్ కంట్రోల్ రూం వైపు వెళ్లే వాహనాలను నేరుగా హెచ్డీఎఫ్సీ వైపు వెళ్లనివ్వరు. ఈ వాహనాలు పాత సైఫాబాద్ పీఎస్ నుంచి ఇక్బాల్ మినార్ చేరుకుని, అక్కడ యూ/రైట్ టర్న్ తీసుకుని రవీంద్రభారతి మీదుగా ఓల్డ్ కంట్రోల్ రూం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
ట్రయల్ రన్ కంటే ముందే స్థానిక వ్యాపారులు, నివాసితులు, నిత్య ప్రయాణికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 22న నిర్వహించే ఒక్క రోజు ట్రయల్ రన్ సమయంలో ట్రాఫిక్ వేగం, ప్రయాణ సమయం, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సాంకేతిక డేటాను నిపుణులతో సేకరించి విశ్లేషించిన తర్వాతే ఈ వన్ వేను శాశ్వతంగా కొనసాగించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్లు మాట్లాడుతూ.. జంక్షన్ల వద్ద నిరీక్షణ సమయం తగ్గించి, ఇంధనం ఆదా చేయడంతో పాటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రోడ్లపై గుంతలు లేకుండా చేయడం, రాత్రివేళల్లో సైన్ బోర్డులు, లైటింగ్‌ల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ నూతన విధాన విజయవంతానికి నగరవాసులు, వాహనదారులు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
-
Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
-
Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! ‘రామాయణ’ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!