Kusukuntla Prabhakar Reddy: నేడే ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్.. ప్రమాణం చేయించనున్న స్పీకర్ పోచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kusukuntla Prabhakar Reddy: మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు MLAగా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఉప ఎన్నిక తర్వాత TRS బలం అసెంబ్లీలో 104కు చేరింది. మజ్లిసు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, BJPకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్‌కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 10.58 శాతం ఓట్లు.. ఇతరులకు 08.09 శాతం ఓట్లు దక్కాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, హరీష్‌రావు.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ బరిలోకి దింపారు.. ఇదే ఆ పార్టీకి కలిసివచ్చింది.. మునుగోడు గెలుపుతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ వరుసగా మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
Read also: Kane Williamson: ఆ ఇద్దరి వల్లే కొంప కొల్లేరు.. కేన్ సంచలన వ్యాఖ్యలు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డిపై 10 వేల 309 ఓట్ల తేడాతో గెలిచారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022 నవంబరు 3న జరిగే ఉప ఎన్నిక జరిగింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలో విజయం సాధించారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాగా మునుగోడులో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Pakistan Record: న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన పాకిస్థాన్
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!