Site icon NTV Telugu

KTR : నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి.

Kavitha Ktr

Kavitha Ktr

KTR : హనుమకొండలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారినే మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, రేవంత్ రెడ్డిని బీసీ ద్రోహిగా వ్యాఖ్యానిస్తూ, ఆయన వ్యవహారం కొండంత రాగం తీసి గాడిద పాడినట్టుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ప్రజలను నమ్మించి తర్వాత మోసం చేసినట్టుగా ఉన్నాయని, అలాంటి పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. పార్టీతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్న తీరు అసంబద్ధంగా ఉందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటిగా వారి నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయని, త్వరలోనే ప్రజలు ఈ పాలనలో ఉన్న లోటులను స్పష్టంగా గమనిస్తారని భావించారు.

పోకో నుండి సర్‌ప్రైజ్.. Poco Pad X1, Pad M1 గ్లోబల్‌గా లాంచ్.. ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..!

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొన్న కేటీఆర్, గాడిదలను చూస్తే గుర్రం విలువ తెలిసినట్టే ప్రజలు బీఆర్ఎస్ పాలన విలువను ఇప్పుడు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించేందుకు దీక్షాదివాస్ అవసరమని, కేసీఆర్ తెగువ, నిరాహార దీక్ష ఉద్యమాన్ని విజయానికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు.

అవినీతి విషయంలో రేవంత్ రెడ్డి ప్రవర్తన రాష్ట్రానికి అనకొండలా, చీడపురుగులా మారిందని ఆయన ఆరోపించారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రిని గల్లీగల్లీ తిరిగేలా చేశామని అన్నారు. కాంగ్రెస్ ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమిదని, ఇటువంటి ద్రోహం ఎక్కువకాలం నిలవదని స్పష్టం చేశారు. ఓరుగల్లు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిఘటన మొదలవుతుందని, రాబోయే రెండేళ్లలో ఈ ప్రభుత్వంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..

Exit mobile version