Poco Pad X1, Pad M1: ప్రముఖ టెక్ సంస్థ పోకో నవంబర్ 2025 గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో Poco Pad X1, Poco Pad M1 రెండు కొత్త టాబ్లెట్లను లాంచ్ చేశారు. ఇక ఈ టాబ్లెట్ల మోడళ్లతో పాటు Poco F8 Pro, Poco F8 Ultra స్మార్ట్‌ఫోన్‌లను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ రెండు కొత్త టాబ్లెట్లు డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ విభాగాల్లో అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ రెండు టాబ్లెట్ల స్పెసిఫికేషన్లను చూద్దామా..
Poco Pad X1 స్పెసిఫికేషన్లు:
పోకో ప్యాడ్ X1 టాబ్లెట్‌లో Qualcomm Snapdragon 7+ Gen 3 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇది 3.2K రిజల్యూషన్ డిస్ప్లేతో, గరిష్టంగా 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో హై-ఎండ్ పనితీరు, గేమింగ్, కంటెంట్ కన్సంప్షన్ కోసం ఇది మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.
iQOO 15: 7000mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP కెమెరాలతో.. ఐకూ 15 విడుదల.. ధర ఎంతంటే?
Poco Pad M1 స్పెసిఫికేషన్లు:
మరోవైపు Poco Pad M1 మరింత పెద్ద బ్యాటరీతో ఆకట్టుకుంటోంది. ఇందులో 12,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇది 12.1 ఇంచుల డిస్ప్లేతో 2.5K రిజల్యూషన్, గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఎక్కువసేపు పని చేయాల్సిన యూజర్లు, స్టూడెంట్స్, ఎంటర్టైన్మెంట్ లవర్స్‌కు ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.
ధరలు:
Poco Pad X1 ధరను కంపెనీ $399 (రూ. 36,000)గా నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద దీన్ని $349 (రూ. 31,000)కు అందిస్తోంది. ఇది 8GB RAM + 512GB స్టోరేజ్ ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. ఇక Poco Pad M1 ధర $329 (రూ. 29,000)గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో ఇది $279 (రూ. 25,000)కు లభించనుంది. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్ సింగిల్ మోడల్‌గా అందుబాటులో ఉంది. పోకో తాజా టాబ్లెట్లు ఈరోజు నుంచే కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. Poco Pad X1, Pad M1 రెండు మోడళ్లూ నీలం (Blue), నలుపు (Black) రంగుల్లో లభ్యమవుతాయి.
IND vs SA 2nd Test: భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే.. మెయిన్ రీజన్ గంభీర్!