KTR : ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..
- ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై ఘాటు స్పందించిన కేటీఆర్
- రాజకీయ ప్రేరేపిత కేసులేనన్న ఆరోపణ
- ఎమ్మెల్సీ కవితకు న్యాయం జరిగిందని వ్యాఖ్య
- మీడియా ట్రయల్స్, దర్యాప్తు సంస్థల వినియోగంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, అలాగే బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేయడానికి ఈ అక్రమ కేసును సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని కేటీఆర్ విమర్శించారు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకులపై మోపిన ప్రతి కేసు అబద్ధమని, అది కేవలం కల్పితమని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఎమ్మెల్సీ కవితకు కోర్టులో న్యాయం లభించడాన్ని కేటీఆర్ స్వాగతించారు. తమ పార్టీ నాయకులపై మోపిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా వీడిపోతాయని, చివరకు నిజం నిలకడగా తెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషం చిమ్మాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములై “మీడియా ట్రయల్స్” నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించాయని ఆయన విమర్శించారు. సాక్ష్యాధారాల కంటే ఆరోపణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!