CFN Pabbala Anil: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో యువ జవాన్ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.