KCR : ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, కేటీఆర్ భేటీ.. జూబ్లీహిల్స్ ఓటమిపై కీలక సమీక్షలు
- ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్,కేటీఆర్ కీలక భేటీ
- జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్ అగ్రనేతల లోతైన సమీక్ష
- తెలంగాణ భవన్‌లో క్యాడర్‌తో కేటీఆర్ సమావేశానికి సిద్ధం
- బైపోల్స్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో వ్యూహాత్మక మార్పుల పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమి నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మక చర్యలు వేగం పెంచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు, తదనంతర పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై కేసీఆర్ కేటీఆర్‌తో సమీక్షించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్స్ ఫలితాలు పార్టీ అంచనాలను తలకిందులు చేసిన నేపథ్యంలో, స్థానిక నాయకత్వం, క్యాడర్ స్థాయి బలహీనతలు, ప్రచార తీరుపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. బైఎలక్షన్లలో ఎదురైన ప్రతికూలతల నుంచి బయటపడడానికి ఏ మార్పులు అవసరమో పార్టీ అగ్రనేతలు అంతర్గతంగా చర్చించినట్టు వర్గాలు చెబుతున్నాయి.
CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. భారత రాజ్యాంగంపై ప్రసంగం!
Also Read
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ఇదిలా ఉండగా, కేటీఆర్ స్వయంగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంకానున్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి స్థానిక క్యాడర్‌ను భారీ సంఖ్యలో ఆహ్వానించారు. ఓటమి నేపథ్యంలో క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తి, స్థానిక స్థాయి లోపాలు, ప్రచార వ్యూహాలు, భవిష్యత్ బలోపేత కార్యక్రమాలపై కేటీఆర్ నేరుగా పార్టీ కార్యకర్తలతో చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఓటమిని పాఠంగా తీసుకుని, పార్టీని మళ్లీ పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలను ఈ సమీక్షల ద్వారా బీఆర్ఎస్ నిర్ణయించనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
- Tags
- BRS
- Jubilee Hills bypoll
- kcr
- ktr
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!