KTR: బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్‌పై సైతం ఆ పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని, మతపరమైన వ్యక్తుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే బీజేపీ సహించదని, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించదని బీజేపీ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ‘‘బీజేపీ నిజంగానే అన్ని మతాలను గౌరవిస్తే.. అన్ని మసీదులను తవ్వి, ఉర్దూపై నిషేధం విధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి’’ అని ఆయన నిలదీశారు. కాగా.. హిందూ ఏక్తా కార్యక్రమంలో బండి సంజయ్ తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వాలని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు. శవాలొస్తే మీకు, శివలింగాలొస్తే మాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెలంగాణ తీవ్ర దుమారం రేపాయి.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
If the BJP truly respects all religions equally, should you also not suspend Telangana BJP chief who made an open public statement wanting to dig up all the mosques & impose a ban on Urdu?
Why this selective treatment @JPNadda Ji? Any clarification? https://t.co/6tqMLWSW3w
— KTR (@KTRBRS) June 5, 2022
తాజావార్తలు
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!