Site icon NTV Telugu

KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర

Ktr

Ktr

KTR : సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీల జాతర పెట్టిన కాంగ్రెస్, ఎన్నికల తర్వాత మాత్రం చెప్పుల జాతర మిగిల్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “ఆనాటి రోజులు తిరిగి తెస్తానని రేవంత్ నిజమే చెప్పాడు… కానీ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశాడు” అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే వెనుకబడ్డామని అంగీకరించారు.

Suriya : రూట్ మార్చిన సూర్య

కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కేటీఆర్ విపులంగా వివరించారు. గోదావరి జలాలు సమృద్ధిగా దొరికే మెడిగడ్డలో ఈ ప్రాజెక్టును నిర్మించామని, 21 పంప్ హౌస్‌లు, 19 సబ్‌స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల సొరంగాలు, వేల కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిందని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కట్టినా కేసీఆర్‌పై సీబీఐ విచారణ పెట్టడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో కరోనా సమయంలో కూడా ఆదాయం సున్నా అయినా సంక్షేమ పథకాలు ఆగలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ నాయకులు మాత్రం ఢిల్లీకి మూటలు మోయడమే పని చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం తెలంగాణ అప్పులు మూడు లక్షల కోట్లకు పైగా ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతోందని, వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను “దండుపాళ్యం బ్యాచ్”గా అభివర్ణించిన ఆయన, “మన దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.

Dharmana Prasada Rao : బెయిల్ రాకుండా చేయడం కోసమే

Exit mobile version