Focus on farmers: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు రైతులపై దృష్టి సారించాయి. అన్ని రాజకీయ పార్టీలు రైతులకు భరోసా కల్పించి రైతులకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రైతులకు అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పంట నష్టపోయిన తెలంగాణ రైతులు రైతుల పొలాల్లోకి వెళ్లి స్వయంగా పంటనష్టం వివరాలను సేకరించి పంట సాయం కోసం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని బీజేపీ నేతలు సూచించారు.
Read also: Revanth Reddy: కేసీఆర్ కొనకపాయే.. చేతికొచ్చిన పంట ఆగమైపాయే
ప్రభుత్వం స్పందించకుంటే రైతుల కోసం బీజేపీ తరపున పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించి నష్టపరిహారం ఇచ్చే వారు లేకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలకు రైతులపై అపారమైన ప్రేమ ఉందని రైతులు భావిస్తున్నారు.
Oscars: 96వ ఆస్కార్ అవార్డుల హంగామా మొదలు!
