Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
- కేఆర్ఎంబీ అజెండాలోని లెక్కలపై హరీశ్ రావు ప్రశ్నలు
- ఏపీ నీటి తరలింపుపై గణాంకాలను ప్రస్తావించిన మాజీ మంత్రి
- ఉత్తమ్ ప్రకటనలకు అధికారిక లెక్కలకు పొంతన లేదని విమర్శ
- కృష్ణా జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జలాల వినియోగం విషయంలో తప్పులను కప్పిపుచ్చుకుంటూ, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాకు, మంత్రి చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ఒక లెక్క చెబుతూ, తెలంగాణ ప్రజలకు మరో లెక్క చెబుతూ ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఎజెండాలో ఒక లెక్క.. ట్వీట్లలో మరో లెక్కా?
21వ కేఆర్ఎంబీ సమావేశం కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాలోని గణాంకాలను హరీశ్ రావు తెరపైకి తెచ్చారు. 2026 సెప్టెంబర్ 21 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏకంగా 45.791 టీఎంసీల నీటిని తరలించిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎంజీకేఎల్‌ఐఎస్ (MGKLIS) ద్వారా బేసిన్ పరిధిలోని అవసరాల కోసం కేవలం 10.653 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకున్నట్లు అజెండాలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. అధికారిక పత్రాల్లో ఒకలా ఉంటే, మంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా మరో లెక్క చెబుతున్నారని, ఈ రెండింటిలో ఏది నిజమో, ఏది తప్పుయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
- TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కేఆర్ఎంబీకి ప్రభుత్వమే సమర్పించిన గణాంకాలు నిజమైతే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ట్వీట్లు, ప్రకటనలు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని హరీశ్ రావు విమర్శించారు. కేఆర్ఎంబీని ఒక రకంగా మభ్యపెడుతూ, తెలంగాణ ప్రజలకు వేరేలా తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మంత్రిపై లేదా అని నిలదీశారు. చరిత్రలో కృష్ణా నీళ్లను అత్యంత తక్కువగా వినియోగించుకున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. నీళ్లను ఒడిసిపట్టి వాడుకో చేతకానీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, నీటిని కిందికి వదిలేసి ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్ని తప్పుడు లెక్కలు చెప్పినా వాస్తవాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!