Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- గవర్నర్ ఆమోదంతో బర్తరఫ్ పూర్తి
- రాజ్‌భవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు
- రెండు శాఖలకు కొత్త బాధ్యతలు?
- కొండా దంపతుల నెక్స్ట్ స్టెప్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారానికి తుది ఘట్టం పడింది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం పంపిన సిఫార్సు లేఖకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అధికారికంగా జీవో జారీ అయింది.
ముగిసిన ఉత్కంఠ.. వేగంగా పావులు కదిపిన ప్రభుత్వం
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం, దేవాదాయ శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలు, కొండా సురేఖ వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ తుది నిర్ణయం తీసుకుని, ఆ ఫైలును గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. పరిశీలన అనంతరం గవర్నర్ తక్షణమే ఆమోదం తెలపడంతో ఆమె బర్తరఫ్ ప్రక్రియ పూర్తయింది. కొండా సురేఖ బర్తరఫ్‌తో ఖాళీ అయిన దేవాదాయ, ధర్మాదాయ , అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలను ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంచుకోనున్నట్లు లేదా మరొక సీనియర్ మంత్రికి అదనపు బాధ్యతలుగా అప్పగించనున్నట్లు తెలిసింది.
Also Read
- OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
కొండా వర్గం తదుపరి అడుగుపై ఉత్కంఠ
ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీ ద్వారా ఫిర్యాదులు పంపడం, మరోవైపు మీడియా ముందుకు వచ్చి ఘాటు వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాల మధ్య గవర్నర్ ఆమోదం రావడంతో కొండా సురేఖ తన మంత్రి పదవిని అధికారికంగా కోల్పోయారు. ఈ పరిణామంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగగా, కొండా సురేఖ దంపతులు తమ తదుపరి రాజకీయ ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
-
Jaishankar in Kyiv: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!