Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమిపై కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. వేల సంవత్సరాలుగా గడ్డకట్టిన పర్వతాలు, మంచు పొరల కింద నిద్రిస్తున్న నేలలు మనకు ప్రకృతిలో భాగాలుగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఆ మంచు ప్రపంచం నెమ్మదిగా కరిగిపోతోంది.
ఆర్కిటిక్ నుంచి హిమాలయాల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు కరిగి నీరుగా మారుతోంది. ఈ మార్పు భూమి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో రెండు కొత్త నివేదికలు ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టాయి.
Also Read
- Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
- Breast Cancer: 17ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
- Monkey Branching: డేటింగ్లో కొత్త ట్రెండ్.. మంకీ బ్రాంచింగ్ అంటే ఏంటి?
- Lancet Report: 22 లక్షల మరణాలకు కారణం ఇదే! లాన్సెట్ నివేదిక బయటపెట్టిన నిజం
నవంబర్ 2, 2026న ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, ఇంటర్నేషనల్ క్రయోస్ఫియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ కలిసి Overshoot and the Cryosphere: Averting Global Meltdown, State of the Cryosphere 2026: The Cost of Overshoot పేర్లతో ఈ నివేదికలను విడుదల చేశాయి. వీటి ప్రకారం ప్రపంచంలోని మంచు ప్రాంతాలు భూమి సగటు కంటే వేగంగా వేడెక్కుతున్నాయి.
గత దశాబ్దంలో ఆర్కిటిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రపంచ సగటు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. హిందూకుష్ హిమాలయాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఈ పర్వత ప్రాంతాల్లో పెరుగుదల 1.8 నుంచి 2.2 డిగ్రీల వరకు ఉండవచ్చు. అయితే మంచు కరగడం వల్ల ప్రమాదం కేవలం నీటి మట్టాలు పెరగడమే కాదు. ఉత్తర అర్ధగోళంలో దాదాపు కోటి 40లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం గడ్డకట్టిన నేలతో విస్తరించి ఉంది. ఈ నేలల్లో కనీసం 1,700 బిలియన్ టన్నుల కార్బన్ నిల్వ ఉంది.
వేల సంవత్సరాలుగా మంచు కింద నిశ్శబ్దంగా ఉన్న ఈ కార్బన్, నేలలు కరిగినప్పుడు వాతావరణంలోకి విడుదలవుతుంది. దీంతో భూమి మరింత వేడెక్కుతుంది. అటు గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికాలోని మంచు ఫలకాలు 1990లతో పోలిస్తే ఇప్పుడు ఆరు రెట్లు వేగంగా కరిగిపోతున్నాయి.
పారిస్ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పరిమితిని తాత్కాలికంగా దాటినా కొన్ని మంచు వ్యవస్థల్లో జరిగే మార్పులు శాశ్వతంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఈ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ మార్పుల ప్రభావం హిమాలయాల్లో ఇప్పటికే కనిపిస్తోంది. పర్వతాలపై మంచు కరిగి పెద్ద పెద్ద సరస్సులుగా నీరు చేరుతోంది. వాటికి అడ్డుగా ఉన్న మంచు, రాతి గోడలు బలహీనపడితే ఒక్కసారిగా లక్షలాది క్యూబిక్ మీటర్ల నీరు దిగువకు దూసుకొస్తుంది. దారిలో ఉన్న గ్రామాలు, ఇళ్లు, రహదారులు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఇలాంటి వరదలు ప్రపంచంలోని ఇతర మంచు పర్వత ప్రాంతాలకు కూడా ఒక హెచ్చరికగా మారాయి. హిమాలయ ప్రాంతంలోని ఎనిమిది దేశాల్లో 1835 నుంచి 2025 వరకు సంభవించిన ఇలాంటి వరదలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మరో అధ్యయనం జరిగింది.
Glacial Lake Outburst Flood Risks, Response Strategies and Adaptation Gaps in the Hindu Kush Himalaya Region పేరుతో రూపొందించిన ఈ అధ్యయనం భారత్‌లోని పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పింది.
ఈ ప్రాంతంలో వరదల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ ప్రాణనష్టం విషయంలో మొదటి స్థానంలో ఉంది. చైనాలో 199, పాకిస్థాన్‌లో 152, భారత్‌లో 62, నేపాల్‌లో 58 వరదలు నమోదయ్యాయి. కానీ భారత్‌లో ఈ ఘటనల కారణంగా 6,119 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో 1,991 మంది, చైనాలో 625 మంది మరణించారు. 1950 తర్వాత ఈ తరహా వరదలు భారీగా పెరిగాయి. ప్రతి పదేళ్లకు సగటున 34 వరదలు నమోదవుతున్నాయి. ఇది అంతకుముందు కాలంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. నమోదైన ఘటనల్లో సగం మంచు కొండచరియలు విరిగిపడటం వల్ల, మరో 25 శాతం భారీ వర్షాల వల్ల సంభవించాయి.
దాదాపు 70 శాతం వరదలు వేసవి వర్షాకాలంలోనే వచ్చాయి. అంటే పర్వతాలపై పెరుగుతున్న వేడి, భారీ వర్షాలు కలిసి వేలాది మంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. నిజానికి మంచు కరిగిపోవడం అనేది పర్వతాలపై మొదలయ్యే మార్పు మాత్రమే. కానీ దాని ప్రభావం ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఒకవైపు వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ భూమిని మరింత వేడెక్కిస్తుంటే మరోవైపు కరిగిన మంచు నుంచి పుట్టే వరదలు పర్వత ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను ముంచెత్తుతున్నాయి.
ఈ మార్పుల వేగాన్ని తగ్గించాలంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం ఎంత అవసరమో హిమాలయాల్లో నివసించే ప్రజలను ముందస్తు హెచ్చరికలు, విపత్తుల నుంచి రక్షించే ఏర్పాట్లతో కాపాడటం కూడా అంతే అవసరం. ఎందుకంటే మంచు కరిగిన తర్వాత మిగిలేది కేవలం నీరు మాత్రమే కాదు. మనం నిర్లక్ష్యం చేసిన వాతావరణ మార్పుల ప్రభావం కూడా.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
-
Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
-
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!