Komati Reddy: రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైన ఉన్నారు..! వారి గురించి సీఎం కేసీఆర్ మాట్లాడరా? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం యెల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు భూపాల్ పుట్టిన వేడుకల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఎంపీ కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పనులు చెయ్యడంలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మీదగ్గర సిద్దిపేటలో లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసిన 10 సంవత్సరాలుగా ఎడిపిస్తారా అని అన్నారు. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పూర్తి చేసి అన్ని గ్రామాలకు సాగు నీళ్లు ఇస్తామన్నారు. కుటుంబ పాలన పోతేనే పేదలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయన్నారు. కేసీఆర్ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తెచ్చారని అన్నారు. దళిత బంధు పేరుతో రూ.10లక్షల ఇస్తే.. అందులో రూ.3లక్షలు కమిషన్ తీసుకుంటున్నారని అన్నారు. దళిత బంధు కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. బీసీ బంధు కూడా ఎన్నికల తర్వాత మాయం అవుతుందని అన్నారు.
Read also: Harish Rao: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న.. ప్రతిపక్షాలపై హరీష్ ఫైర్
కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైన ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి గురించి కేసీఆర్ మాట్లాడరని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు అమ్మి ఆ డబ్బుతో దళిత బంధు ఇస్తోంది ప్రభుత్వం అన్నారు. ఒక లీడర్ కు నల్లగొండ జిల్లాలో 20 ఇల్లు, 500 నుంచి 1000 ఎకరాల భూములు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. నా సంపాదన మొత్తం పేదలుకె ఇచ్చిన.. అయనలా డబ్బులు దాచుకుంటే వందల ఎకరాల భూమిని, ఫార్మహౌస్ లు కట్టుకునేవాన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యే గా ఉన్నపుడు దాసరి గూడెంలో ఇండ్లు కడితే సీఎం కేసీఆర్ ప్రభుత్వం వాటిని పెదవాళ్లకు ఇవ్వకుండా అమ్ముకున్నారని మండిపడ్డారు. దళితులకు పది లక్షలు అని చెప్పి 10మందిలో 5గురికి ఇచ్చి ఎన్నికలు ఐపోగానే వదిలేస్తారని తెలిపారు. అదే డబ్బులను దళితులకు ఇంటికి లక్ష లెక్క ఇస్తే దళితులందరూ బాగుపడతారని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఆయన్ను ఎత్తుకెల్లిండని, కానీ ఆయన భార్య పార్వతమ్మ ఇప్పటికి మనతోనే ఉందని, కలిసి ప్రచారంలో కూడా పాల్గొందని అన్నారు.
Varun Tej : సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’..