Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గంలో చేరిక సందర్భంగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుళ విభజన వ్యవస్థ విస్తరణలో తాను కూడా మంత్రి అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. తన సోదరుడు వెంకటరెడ్డి మంత్రి అయినా తనకు అడ్డంకి కాదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో ఉన్న సత్తా చూసి మంత్రి పదవి కూడా దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన వచ్చాక జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఊడ్చిపెట్టుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము పోరాడామని, కోమటిరెడ్డి మంత్రి పదవిని కూడా వదులుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని.. నా లక్ష్య కేసీఆర్ పైన పోరాటమే.. అన్నారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరినాక.. మా నలగొండ జిల్లాలో పార్టీ బలపడిందన్నారు.
Read also: Anasuya Bharadwaj: ట్రెండీ అందాలతో అలరిస్తున్న…అనసూయ భరద్వాజ్
మొదటి విడతలో నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి మంత్రి వర్గం లో స్థానం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. రెండో విడతలో తనకు కూడా మంత్రి పదవి వస్తుందని అధిష్టానం చెప్పిందని స్పష్టం చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులు అన్నది వాళ్ళ , వాళ్ళ కెపాసిటీ నీ బట్టి వుంటుందని అన్నారు. గతంలో క్రికెట్ టీమ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్న దమ్ములు ఆడారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయబోతున్నామని తెలిపారు. తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరినా కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేశామన్నారు. ఆ ఆశయం కోసమే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయన్నారు. రెండో విడతలో మంత్రి పదవి కూడా వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసేందుకు కేసీఆర్ అప్పులు చేశారని ఆరోపించారు.
Salaar Vs Dunki: ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ ని కూడా డైరెక్టర్స్ డామినేట్ చేస్తున్నారు