Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న లక్ష్మీ అనే మహిళపై పులి దాడి ఘటన మరువక ముందే ఇవాళ ఉదయం మరో రైతుపై దాడి చేసింది. సిర్పూర్ టౌన్ దుబ్బగూడ వద్ద చేనులో పని చేస్తున్న రౌత్ సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది. దీంతో సురేష్ గట్టిగా కేకలు వేశాడు. గమనించిన తోటి రైతులు అక్కడకు పరుగున రావడంతో పులి అక్కడి నుంచి పరార్ అయ్యింది. సురేష్ పులి దాడి చేయడంతో మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించి సురేష్‌ను చికిత్స అందించారు. అయితే సురేష్ పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స కోసం సిర్పూర్ నుంచి కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కాగజ్‌నగర్ మండలంలో ఆంక్షలు విధించారు. ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు.
Read also: MLA Aadi Srinivas: వాడు వీడు అంటే మేము అనాల్సి వస్తుంది.. కేటీఆర్‌పై ఎమ్మెల్యే ఫైర్..
పులి కదలికలపై నిఘా పెట్టేందుకు ఎక్కడికక్కడ బోనులు, కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈద్గాం, నజ్రల్ నగర్, సీతానగర్, అనుకాడ, గన్నారం, కదంబ, ఆరెగూడ, బాబునగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలు పొలం పనులకు వెళ్లవద్దని హెచ్చరించారు. గత నాలుగేళ్లలో ఇక్కడ పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అన్నారు. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఈ పులి దాడిలో గత నాలుగేళ్లలో నలుగురిపై దాడి చేయడంతో మృతి చెందారని అన్నారు. దీంతో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. పులుల దాడిలో మరణించిన వారంతా పొలం పనులకు వెళ్లినవారే వుండటం గమనార్హం.
Read also: Virat Kohli: నేను ఆర్సీబీకి మద్దతు ఇస్తానని విరాట్‌తో చెప్పాను: ఆస్ట్రేలియా మంత్రి టిమ్ వాట్స్
వరుసగా మనుషులపై పులుల దాడితో జనం బెంబేలెత్తి పోతున్నారు. నిన్న దాడి చేసిన పులి ఈరోజు దాడి చేసిన పులి ఒక్కటేనా అని అనుమానం వ్యక్తం చేశారు. రెండు దాడులకు కారణాలపై అటవీశాఖ అధికారుల ఆరా తీస్తున్నారు. కొత్తగా వచ్చిన పులిగా అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి దాడి చేసి ఉంటుదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
KTR Tweet: కొద్ది రోజులు రెస్ట్ కావాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్..