Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
- తెలంగాణ ప్రజల తరుఫున ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నా
- 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి
- ఒకేసారి తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఎయిర్‌పోర్టులా మార్చుతున్నాం -కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో భాగ్యనగరం అభివృద్ధి కాంతులతో మెరిసిపోతోంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ (HICC) కి చేరుకున్న ప్రధాని, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. సుమారు రూ. 9,400 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. 2014 కంటే ముందు రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు కేంద్రం చొరవతో అవి ఎంతలా మెరుగుపడ్డాయో ప్రజలు గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. గతంలో ప్రధాని పర్యటనలకు అప్పటి ముఖ్యమంత్రులు రాకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినా, కేంద్రం మాత్రం రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read
- PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
- Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
- TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?