Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ-బోరుసు లాంటివి.. నీతివంతమైన పాలన తెస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Talks About PM Modi Telangana Tour: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు లాంటివని.. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఏనాడూ కాంగ్రెస్‌తో గానీ, బీఆర్ఎస్తో గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. కానీ.. గతంలో ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయని, ప్రభుత్వాన్నీ పంచుకున్నాయని అన్నారు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి.. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన వరంగల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వస్తున్నారన్నారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
రూ.6,109 కోట్లు జాతీయ రహదారులకు, రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు మోడీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. తొలి దశలో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తున్నామని.. దీని వల్ల 3వేల మందికి ఉద్యోగా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందుకు తాను ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రేపు ప్రధాని మోడీ మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తారని.. మొదట వరంగల్‌కు వస్తారని తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల అనంతరం విజయ సంకల్ప సభ ముఖ్యమైందని.. ఇది రాజకీయంగా ఎంతో కీలకమైన సభ అని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీపై అబద్ధాలు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడుతున్నామో మోడీ వివరిస్తారని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడేలా బీజేపీ కృషి చేస్తోందన్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన కిషన్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్‌కు పరిమితం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం కమిషన్ల, వాటాల ప్రభుత్వంగా మారిందని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ప్రభుత్వంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. బహుళజాతి కంపెనీలకు భారత్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అన్నారు. అతిపెద్ద ఆర్థికాభివృద్ధి దేశంగా ఐదోస్థానంలో మనం ఉన్నామన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే.. నిజమైన, నీతివంతమైన పాలనను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దేశంలో నీతివంతమైన పాలన మోడీ నేతృత్వంలో కొనసాగుతోందన్నారు. మోడీ స్ఫూర్తితో తెలంగాణలో కుటుంబరహిత నీతివంతమైన పాలనను తీసుకొస్తామన్నారు.
తాజావార్తలు
-
IPl 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!