Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ కు మూడింతలు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి, గజ్వేల్ ల సభలు చూసాక రెండు చోట్ల కేసీఆర్ ఒడిపోతున్నరని స్పష్టం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిల కేసీఆర్ కోసం వచ్చిన రేవంత్ రెడ్డి కూడా పడిపోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రస్, ఎంఐఎంల ఒప్పందంలో భాగంగానే కామారెడ్డికి రేవంత్ రెడ్డి వచ్చారని అన్నారు. కామారెడ్డి వెంకట రమణ రెడ్డి, గజ్వేల్ లో ఈటెల రాజేందర్ లో భారీ మెజారిటీతో గెలవబోతునారని అన్నారు. బయట ఎంత ప్రచారం జరుగుతున్న యువత, మహిళలు, రైతులు బీజేపీ ఉన్నారని తెలిపారు. 30 వ తేదీన తెలంగాణ ప్రజలు బీజేపీ కి బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. ఏమీ చేశామో చెప్పకుండా డబ్బు, మద్యం పై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నమ్మకం పెట్టుకున్నాయన్నారు.
Read also: Kartika Purnima: తెలుగు రాష్ట్రాలకు కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..
బీజేపీ, మోడీ చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తామన్నారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మాటలు మైనారిటీల బుజ్జగింపు అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూకు మూడింతలు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజాన్ని తప్పు దోవ పట్టించే విధంగా హామీలు ఇస్తున్నారని తెలిపారు. రాహుల్, కేసీఆర్ లు తలకింద తపస్సు చేసిన, కాళ్ళు పైన పెట్టిన 12 శాతం ముస్లిం రిజర్వేషన్ లు ఇవ్వలేరని తెలిపారు. ఐటీ పార్క్ లలో కూడా మతం ఎక్కడ ఉంటుందన్నారు. ఈ పార్టీలు ఎంతకు దిగజారారో తెలుస్తుందన్నారు. ముస్లింల మీద చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల హాయంలో ఓల్డ్ సిటీ అభివృద్ది చేయలేదన్నారు.
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు