Kartika Purnima: తెలుగు రాష్ట్రాలకు కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Purnima: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఉదయం నుంచే భారీగా భక్తుల రద్దీ నెలకొంది. ఆలయాల్లో శివనామస్మరణ మారుమోగుతున్నాయి. ప్రత్యేక అభిషేకం, పూజలతో తమ కోరికను కొలుస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు నదులలో స్నానం చేసి కార్తీక దీపారాధన చేస్తారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, అన్నవరం, ద్వారకాతిరుమలలోని భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీరంగూడలోని ప్రముఖ దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా భక్తులు కార్తీక పూర్ణిమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఇక్కడ మల్లికార్జున స్వామికి సంప్రోక్షణ నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో కూడా కార్తీక మాసంలో ఆలయాలన్నీ కళకళలాడాయి. హనుమకొండ రుద్రేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్ర స్వామి, అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో నిల్చుని దీపపూజలు చేస్తున్నారు.
Read also: Raghunandan Rao: 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచిన నన్ను ఎక్కిరిస్తుండు
Also Read
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, భద్రాచలంలోని గోదావరి, విజయవాడలోని కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సోమవారం కార్తీక పూర్ణిమ కావడంతో అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో ఉపవాస దీక్షలు చేసేందుకు భక్తుల్లో పోటీ నెలకొంది. పిఠాపురం పాదగయ ప్రాంతంలోని శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడ పాదగయ పుష్కరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి ఘాట్లలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రిలోని మార్కండేయ స్వామి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పంచారామ ప్రాంతంలోని ద్రాక్షారామం, కోటిపల్లి మురుమళ్ల ముక్తీశ్వరుడు క్షణముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!