Kishan Reddy: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Sensational Comments On BRS Govt: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తూ.. నకిరేకల్ పట్టణంలో ఆగి సర్దార్ పాపన్న చిత్ర పటానికి పూలమాలవేసి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందని మండిపడ్డారు. గ్రామకంఠం భూములతో సహా దళితులకు ఇచ్చిన భూముల్ని బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని ఆరోపణలు చేశారు. లిక్కర్ షాపులను ఆరు నెలల ముందే వేలం వేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో నిత్యం బెల్టు షాపులు అందుబాటులో ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Flood Watch: వచ్చేసిన ‘ఫ్లడ్ వాచ్ యాప్’.. ఇక వరద సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చు
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
కుటుంబ పాలనను తరిమికొట్టి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ పంపిణీ.. బీజేపీ పోరాట ఫలితమేనని తేల్చి చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని, వాటి డీఎన్ఏ ఒకటేనని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే మజ్లిస్ పార్టీ వారి పంచెన చేరి దోపిడి చేస్తోందని ఆరోపించారు. 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణ.. ఈరోజు కల్వకుంట్ల చేతిలో బంధీ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!