NTV Telugu Site icon

Kishan Reddy: సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం.. వేడుకల్లో అమిత్ షా

Kishan Reddy

Kishan Reddy

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందేమాతరం రామచందర్ రావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి బేగంబజార్ లో ఆయన కలిశారు.

75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరులకు గుర్తింపు దక్కలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు వారిని స్మరించుకుంటు, వారి జయంతి , వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 1948 లో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరంలో జాతీయ జెండాను ఎగురవేసి నిజాం పాలనకు చరమగీతం పాడరాని, ఈ ఏడాది సెప్టెంబర్17న హైదరాబాద్ నగరంలో హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అధికారికంగా విమోచన వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. పల్లెల్లో పోరాటాల స్ఫూర్తిగా నిర్మించిన బురుజులను అలంకరించి జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపు నిచ్చారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్17 ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత పాలకులు సెప్టెంబర్17 ప్రాముఖ్యత తెలియకుండా మరుగున పడేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలపై కేసులు పెట్టారు తప్పా, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఏ ప్రభుత్వం నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా కార్యక్రమంగా సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకొని వారి కుటుంబాలను కలిసి సన్మానం చేస్తున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు.
Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.

Show comments