Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్‌పై సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అనుకున్న తేదీకి డ్రాగన్ విడుదల కావడం కష్టమేననే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. షూటింగ్ పనుల్లో చోటుచేసుకున్న జాప్యమే ఇందుకు ప్రధాన కారణం.
ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆయనకు సర్జరీ కూడా జరగడంతో.. షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ వచ్చింది. దీంతో ఇప్పటికే ప్లాన్ చేసిన షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా అనుకున్న తేదీకి సినిమా విడుదల దాదాపు అసాధ్యమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సినిమాల మేకింగ్‌లో క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ డీటెయిలింగ్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడరు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయిస్తారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ నేపథ్యంలో జూన్ 11న డ్రాగన్ సినిమాను విడుదల చేయాలనే డెడ్‌లైన్‌ను అందుకోవడానికి హడావుడి చేయడం కంటే.. సినిమాకు అవసరమైన సమయం కేటాయించి అత్యుత్తమ అవుట్‌పుట్ తీసుకురావడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో డ్రాగన్ విడుదల వాయిదా పడే అవకాశాలపై చర్చ మొదలైంది. ఒకవేళ జూన్ 11 రిలీజ్ డేట్‌ను మేకర్స్ మిస్ చేస్తే.. 2027 దసరా సీజన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ప్రస్తుతం జూన్ 11 2027నే అధికారిక రిలీజ్ డేట్. కాబట్టి షూటింగ్ ఆలస్యం, రిలీజ్ వాయిదా, దసరా విడుదల వంటి ప్రస్తుతానికి ఈ వార్తలను రూమర్స్‌గానే చూడాలి.
తాజావార్తలు
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!