Kinnera mogulaiah:‘పద్మ శ్రీ’ వెనక్కి ఇచ్చేస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య తాజాగా, ఓ వీడియోలో బీజేపీ నేతల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 1 కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. అవసరమైతే పద్మ శ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
తన కళను తొలిగా టీఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తించిందని వివరించారు. సీఎం కేసీఆర్ తన కళను గుర్తించి రవీంద్ర భారతిలో ఆరేళ్ల క్రితమే సత్కరించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే తాను బయటి లోకానికి తెలిసానని వివరించారు.
Also Read
ఈ అవార్డు కోసం కూడా తమ ఎమ్మెల్యే (అచ్చంపేట) గువ్వల బాలరాజు సహకరించి తనను ఢిల్లీకి పంపించాడని వివరించారు. తనకు సీఎం కేసీఆర్, తమ ఎమ్మెల్యే ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటున్నారని తెలిపారు. ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మొగులయ్య రూ. 1 రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి రూ. 1 కోటి కేసీఆర్ ప్రకటించారు.
తాజాగా, ఈ డబ్బు కేసీఆర్ ఇంటి నుంచే ఇస్తున్నాడా? అంటూ అచ్చంపేటలోని కొందరు బీజేపీ నేతలు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ శ్రీ అవార్డు బీజేపీ వాళ్లదని వారు వాదిస్తున్నారని పేర్కొన్నారు. దయచేసి తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. అవసరమైతే.. పద్మ శ్రీ అవార్డు కూడా వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారు. పద్మ శ్రీ అవార్డు ఎవరిదైనా సరే.. దాని ద్వారా నాపై రాజకీయాలు చేస్తే.. నా నోట్లె మన్ను కొట్టాలని చూస్తే ఆ అవార్డు వెనక్కి ఇచ్చేస్తాని అని ఆవేదనతో చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తనను ఎవరూ పట్టించుకోలేదని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే తనను గుర్తించిందని వివరించారు.
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!