Balapur Ganesh: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకులు ప్రారంభమయ్యాయి. గణేష్ మండపాలతో వాడవాడలూ అంతా నిండిపోయాయి. ఉదయం నుంచే గణేషునికి పూజలు నిర్వహించారు. కాగా.. ఇవాల ఉదయం నుంచే ఖైరతాబాద్ గణేష్ కు పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ వినాయకుడిని చూసేందుకు భారీగా జనం అక్కడకు చేరుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేష్ తరహా తెలంగాణలో బాలాపూర్ గణేష్ కు ఓ ప్రత్యేకత ఉంది. అంతే కాదు బాలాపూర్ లడ్డూకు 27 ఏళ్ల చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. భారీ ఆకారంలో బాలాపూర్ గణేష్ రూపుదిద్దుకున్నాడు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం తరహాలో మండపం సెట్ నిర్వహించారు అధికారులు. బాలాపూర్ గణేశుడు సాయంత్రం తొలిపూజ అందుకోనున్నాడు. బాలాపూర్ లడ్డూ ధర గతేడాది రూ.24.60 లక్షలు పలికిన విషయం తెలిసిందే..
తెలంగాణలో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్ గణేష్ లడ్డూ 2022లో కూడా భారీ ధర పలికింది. పొంగులేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60 లక్షలకు లడ్డూలను దక్కించుకున్నారు. నిర్వాహకులు రూ.1,11,116 నుంచి వేలంపాట ప్రారంభించగా పలువురు పోటీపడ్డారు. లడ్డూల ధర రూ.100గా ఉండటం విశేషం. గతేడాది కంటే 5.70 లక్షలు ఎక్కువ. 41 ఏళ్లనాటి బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఐదున్నర గంటలకు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంతిమ పూజలు పూర్తి చేసిన లంబోదర గ్రామ ఊరేగింపుకు బయలుదేరారు. గణపతి ప్రధాన కూడలికి చేరుకోగానే వేలంపాట ప్రారంభమైంది. లడ్డూ వేలం రూ.1,11,116తో ప్రారంభం కాగా తీవ్ర పోటీ నెలకొంది. బిడ్డర్లు ఎవరూ వెనక్కి తగ్గకుండా ధర పెంచుతూనే ఉన్నారు. చివరకు పొంగులేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60 లక్షలకు దక్కించుకున్నాడు.
బాలాపూర్ లడ్డూ ఇప్పటివరకు దక్కించుకున్నవారు..
2012లో పన్నాల గోవర్థన్ రెడ్డి రూ. 7.50 లక్షలు
2013లో తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలు
2014లో సింగిరెడ్డి జయేందర్‌రెడ్డి రూ. 9.50 లక్షలు
2015లో కళ్లెం మదన్మోహన్ రూ. 10.32 లక్షలు,
2016లో మేడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డికి రూ. 14.65 లక్షలు
2017లో తిరుపతిరెడ్డి రూ. 15.60 లక్షలు
2018లో శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 లక్షలు
2019లో కొలనా రాంరెడ్డి రూ.17.60 లక్షలు
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం జరగలేదు
2021లో శశాంక్ రెడ్డి రూ.18.90 లక్షలు
2022లో పొంగులేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలు
Health Tips : మిరియాలతో ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు మాయం..