NTV Telugu Site icon

Thummala Nageswara Rao: కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలి.. పార్టీని బ్రతికించుకోవాలి

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం కార్యకర్తలు పనిచేశారు.. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలని అన్నారు. గౌరవంగా తలెత్తుకుని ఉండే విధంగా పనిచేయాలి.. ప్రతిపక్షానికి అవకాశం లేకుండా కృషి చేసి ఆ కుర్చీలో మనం కూర్చోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి..
పదవిని పిలిచి ఇచ్చే రోజులు వస్తాయని కార్యకర్తలకు సూచించారు.

Read Also: Raviteja : అన్నయ్య కోసం భారీ త్యాగం చేసిన తమ్ముడు

ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు ఎంపీలు అయ్యారు.. పార్టీని బ్రతికించుకోవాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల తెలిపారు. తల్లిని కూడా మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.. పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్లు గుర్తించాలన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది.. నిబద్ధతగా పని చేస్తానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ గల వారికి ప్రాధాన్యత ఉంటుంది.. అవకాశవాదులను నమ్మరాదని మంత్రి అన్నారు. అధికారాన్ని అస్థగతం చేసుకోవాలని కార్యకర్తలకు చెప్పారు. సీఎం శక్తికి మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. దేశంలోనే రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Read Also: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..

మరోవైపు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మనకు కావలసిన నిధులు ఇవ్వడం లేదు.. నీటిపారుదల ఇరిగేషన్ రోడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పాజిటివ్‌గా లేదని తెలిపారు. గుండె ధైర్యంతోని సొంత కాళ్ళ మీద నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోరికలు తీరుస్తున్నారని అన్నారు. కార్యకర్తలు అడిగిన ప్రతి పని బాకీ లేకుండా పూర్తి చేస్తానని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1400 కోట్లు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.