Raviteja : మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తుంటారు. ఆయన తాజాగా శ్రీలీలతో జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన “మాస్ జాతర” మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదలై మంచి మాస్ హైప్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పై ఆసక్తికర వార్తలు బయటకొస్తున్నాయి.
Read Also:BJP MLA: “ముస్తఫాబాద్” పేరుని “శివపురి”గా మారుస్తాం.. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే..
ఇప్పుడీ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధంగా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” మే 9న విడుదలకు సిద్ధమవుతోందని టాక్ నడుస్తోంది. మెగాస్టార్‌కు ప్రత్యేకమైన ఈ డేట్‌లో “విశ్వంభర” రావడం సరైనదని ఆ సినిమా మేకర్స్ భావించారు. కానీ అదే సమయంలో రవితేజ సినిమా విడుదల తేదీ కూడా ఉండడంతో అన్నయ్య కోసం తమ్ముడు తప్పుకుంటాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. నిజంగానే “విశ్వంభర” మే 9న రానుందా? “మాస్ జాతర” రిలీజ్ వాయిదా పడుతుందా? అన్న దానిపై త్వరలోనే స్పష్టత రావొచ్చు.
Read Also:Thandel : అదరగొడుతున్న నాగ చైతన్య.. బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న “తండేల్”