Ponguleti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని వారు ఎవరో రెచ్చగొడితే వాళ్ల మాటలు విని మీరు అభద్రతకు లోనూ కావొద్దని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇక, రైతు బంధు ఇవ్వలేదని, ఇళ్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తుంటుంది.. వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పారు. అలాగే, యోగ్యమైన భూమి ఉన్న వారందరికీ రైతుబంధు అందిస్తాం.. కానీ, రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: విజయవాడ పుస్తక మహోత్సవానికి డిప్యూటీ సీఎం.. పవన్ కోసం ప్రత్యేకంగా స్టాళ్లు ఓపెన్..
ఇక, రైతు బంధు విషయంలో ఎవరు అభద్రతకు లోనూ కావొద్దు అందరికీ ప్రభుత్వ పథకాలు వస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుల్లో ప్రత్యర్ధులు రెచ్చగొట్టే చర్యలకు మీరు లోనూ కావద్దు.. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టి వదిలేసిన అన్ని ఇండ్లని పూర్తి చేసి ప్రజలకి అందిస్తాం.. మొదటి విడతగా 3,500 ఇస్తున్నాం.. గ్రామ కమిటీలో అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.