Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదని.. 10 కోట్లు కేటాయించారని పనులు ప్రారంబించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బౌద్ధ స్తూపం వద్ద స్టేట్ టూరిజం ప్రాజెక్ట్ జిఏం జిల్లా అధికారులతో మంత్రులు బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యటక స్థలాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ స్థపంలో మన ప్రాంతం చరిత్ర పుటలలో ఉందన్నారు. దేశంలోనే బౌద్ధ స్తూపిస్తులతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. నిధులు విషయంలో డోకా అవసరం లేదన్నారు. 10 కోట్లు కేటాయింపు … పనులు ప్రారంబించాలన్నారు. అర్కలాజికల్ డిపార్ట్మెంట్ తో కలిసి అభివృద్ధి అన్నారు. బౌద్ధిస్టూలతో కలిసి ఫెస్టివల్ పెట్టాలన్నారు. బుద్దిజం బోధనలు పాశ్చాత్య దేశాలలో ప్రతి వారంలో రెండు రోజుల పాటు అమలు చేస్తారన్నారు. వారానికి ఒక రోజు బుద్ధిజం పేరుతో పర్యాటించాలన్నారు. మనమే ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు.
Read also: KTR Tweet: వ్యవసాయానికి గడ్డుకాలం..ఎక్స్ వేదిగా కేటీఆర్ ట్వీట్
బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారుల తో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. బౌద్ధ స్తూపం ను పర్యాటకులకు అందించేందుకు ఏం చేద్దామన్నారు. ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారన్నారు. ముఖ్యమైన బౌద్ధ స్థూపం కి పూర్వ వైభవం తీసుకుని రావాలన్నారు. 8 ఎకరాలు ను అభివృద్ధి చేయాలని తెలిపారు. స్థూపం కి లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటు కి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. బౌద్ధ స్థలాలు తక్కువ ఉన్నాయి.. తెలంగాణలో మూడు స్థలాలో పాలేరు కీలకమైనదన్నారు. సిబ్బంది కొరత, బడ్జెట్ లేదు అని అధికారుల వెల్లడించారన్నారు.
Read also: Road Accident: శంషాబాద్ లో వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు..
మంత్రి పోంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నే మన బౌద్ధ స్థూపంకి ప్రాధాన్యత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి అన్నారు. అండర్ గ్రౌండ్ లో ఇంకా స్థూపాలున్నాయన్నారు. టూరిజం లో బెస్ట్ ప్లేస్ కింద గుర్తించారన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు స్థానికులు… ఆయన నివసించిన ఇళ్ళని మ్యూజియంగా ఏర్పాటు చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గం లో రిజర్వాయర్ …కాంగ్రెస్ హాయాంలొనే అభివృద్ధి చెందిందని తెలిపారు.
Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత..