Road Accident: శంషాబాద్ లో రెండు వేర్వేరు చోట్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒకటి శంషాబాద్- బెంగళూరు హైవేపై జరగగా.. మరొకటి కొత్వాల్ గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డు పై ప్రమాదాలు జరిగాయి. శంషాబాద్-బెంగళూరు హైవేపై మెలుహ అనే స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. శంషాబాద్ నుంచి అజిత్ నగర్ కు విద్యార్థులను తీసుకువెళ్తున్న స్కూల్ బస్సు. సాతంసాయి వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది.
Read also: Sisters Kidnapping Case: అక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
బస్సు బలంగా ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి గాల్లోకి ఎగిరి బస్సుపై పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన పాదచారి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సులో అక్కడి నుంచి పారిపోయి నేరుగా ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Sisters Kidnapping Case: అక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
శంషాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్వాల్ గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డు లో బైక్ స్కిడై డివైడర్ కు ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు పరిస్థితి విషమంగా వున్నట్లు వెల్లడించారు. రాజేంద్రనగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వస్తున్న హోండా షైన్ వాహనంగా గుర్తింపు. కొత్వాల్ గూడ చెన్నమ్మ హోటల్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను బైక్ ఢీ కొట్టి స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాల పాలై స్పాట్ లో ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Stock Market After Hindenburg : హిండెన్‌బర్గ్ నివేదిక ఎఫెక్ట్ .. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు