కొడుకు అంత్యక్రియల్లో తండ్రి ఆ పని చేయడంతో.. అందరూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్ వినియోగించాలంటూ ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేసింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన తేజావత్ సాయి(18) తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
అంతిమయాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికైనా ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై యువతలో సందేశం పంపాలన్నారు. కుమారుడి శవం పక్కనే నిలబడి చేతిలో హెల్మెట్ పట్టుకున్న హరి, ప్రమాదం జరిగిన రోజు హెల్మెట్ ధరించి ఉంటే తన కొడుకు సాయి బతికి ఉండేవాడని రోదిస్తూ హెల్మెట్ లు పంపిణీ చేశాడు.
Also Read
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
“నా బిడ్డలాగా ఎవ్వరూ చనిపోకూడదని, బైక్ నడిపేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించాలి” అంటూ.. కొడుకు మృతి చెందాడన్న బాధలో కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు హరి ప్రయత్నించారని స్థానికులు కొనియాడారు. ఈ ఘటనను నెటిజన్లు విస్తృతంగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Prahlad Joshi: ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం
-
Viswanath And Sons: వెడ్డింగ్ సాంగ్ తో వేడెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’.. సూర్య సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
-
Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!