కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారని బీజేపీ నేత NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ పెట్టిందే హరీష్ రావును డిల్లీ కు పంపించడానికే అంటూ ఆరోపించారు. అవినీతి కు మారు పేరు brs అంటూ నిప్పులు చెరిగారు. కమ్యూనిస్ట్ ల కోరిక మేరకే ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారంటే ఎద్దేవ చేశారు.
మిషన్ కాకతీయ హైదరాబాద్ లో ఏమైంది? ప్రశ్నించారు బిజెపి నేత Nvss ప్రభాకర్. భారీ వర్షాలతో నగరంలో భారీ నష్టం జరిగిందని మండిపడ్డారు. పలు కాలనీలు నీట మునిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర పురపాలక మంత్రులుగా కెసిఆర్, కేటీఆర్ లే పని చేశారని గుర్తు చేసారు. హైదరాబాద్ దుస్థితికి కారణం తండ్రి కొడుకులే.. వారే నైతిక బాధ్యత వహించాలని మండిపడ్డారు. చెరువుల ఆక్రమణ వల్లే ఈ సమస్య ఏర్పడిందని నిప్పులుచెరిగారు.…