KCR: ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత, డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read Also: SRK : షారుక్.. ‘కింగ్’ బడ్జెట్ తెలిస్తే నోరెళ్లబెడతారు
ఇక, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి అకాల మరణం బాధాకరం అని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను..
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే, ప్రముఖ కవి, రచయిత, డా. అందెశ్రీ అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం పట్ల విచారం తెలుపుతూ, కేటీఆర్ గారు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని ఆయన అన్నారు. అందెశ్రీ మరణంతో శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డా. అందెశ్రీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.
Read Also: SRK : షారుక్.. ‘కింగ్’ బడ్జెట్ తెలిస్తే నోరెళ్లబెడతారు
కాగా, అందెశ్రీ మృతి తీవ్ర విచారకరం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ.. ముఖ్యంగా ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’.. తెలంగాణ ఉద్యమానికి ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో, తదనంతరం.. తెలంగాణ జాతిని జాగృతం చేసే విషయంలో.. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, తెలంగాణ సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని రాజీ పడకుండా విస్పష్టంగా చెప్పారు అందెశ్రీ.. తన రచనలతో తెలంగాణ సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని రాసుకున్నారు.. జీవితాంతం తెలంగాణ కోసమే పని చేసిన సౌమ్యుడు, మంచి మనిషి అయిన అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Fastest Fifty: 6,6,6,6,6,6,6,6.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ, వరల్డ్ రికార్డు!
అలాగే, సహజ కవి, రచయిత అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చదువు లేకపోయినా జీవిత అనుభవాలనే పాటలుగా రచించిన సహజ రచయిత అందెశ్రీ.. నిరంతరం పేదల అభ్యున్నతి, తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవం, తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి అందెశ్రీ.. ఆయన మరణం తెలంగాణ సమాజానికి ముఖ్యంగా సాహితీ లోకానికి తీరని లోటు అన్నారు. అందెశ్రీ రచించిన “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, జయజయహే తెలంగాణ” గీతాలు సదా చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.. అందెశ్రీ మనకు భౌతికంగా దూరమైనా ఆయన రాసిన పాటల రూపంలో సజీవంగా వుంటారు.. అందెశ్రీ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అని బండి సంజయ్ పేర్కొన్నారు.
అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం…
వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్
ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ…’ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
వారి మరణం… pic.twitter.com/ZuF7axpzrJ
— BRS Party (@BRSparty) November 10, 2025
