KCR: ప్రముఖ కవి, 'జయ జయ హే తెలంగాణ' ఉద్యమ గీత రచయిత, డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు.
CM Revanth Reddy: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు.