NTV Telugu Site icon

KCR: నేడు మెదక్ లో కేసీఆర్ బస్సు యాత్ర..

Kcr

Kcr

KCR: నేడు మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రాత్రి 8 గంటలకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ సొంత జిల్లా కావడంతో రోడ్ షో కి భారీగా జనసమికరణకి ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కేసీఆర్ రాక కోసం స్థానిక నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. గులాబీ బాస్ బస్సు యాత్రకు భారీగా జనం తరలి వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర అట్టహాసంగా కొనసాగుతోంది.

Read also: Namburu Sankara Rao: పల్లెల్లో సంక్షేమం చూడండి… పరుగులు పెడుతున్న అభివృద్ధి చూడండి..

రాష్ట్రవ్యాప్తంగా రెండు నియోజకవర్గాల్లో యాత్రలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై చేస్తున్న విమర్శలను ప్రత్యేక అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. పదేళ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ నెల పదో తేదితో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. అదే రోజు సిద్దిపేటలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభా ఏర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు.

Read also: Woman’s Body Found: యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. ఏమైందంటే?

పోలింగ్ కు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ పాలకులపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్థి అభ్యర్థులపై విరుచుకుపడుతున్నారు. మ రోవైపు కుల సంఘాలు, ఆత్మీయ స భ లు, పార్ల మెంటు ముఖ్య నేత ల తో స మావేశ మ వుతున్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించి ఆదుకోవాలన్నారు. ప్రతిరోజూ రెండు, మూడు రోడ్ షోలలో పాల్గొంటూ క్యాడర్ అంతా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read also: Indian 2 : ఇండియన్ 2 కోసం వాయిస్ ఓవర్ అందించనున్న ఆ స్టార్ హీరో..?

బీఆర్ ఎస్ వైపు ప్రజలను ఆకర్షించేందుకు తమదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు బీఆర్ ఎస్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రతి పార్లమెంట్ ఏరియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. BRS తన పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి దాదాపు 40 రోజులు అయ్యింది. అన్ని వర్గాలతోనూ సమావేశమవుతున్నారు. సమ్మేళనాల ద్వారా నిర్వహించబడింది.
Kedarnath: ఈనెల 10న తెరచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం