KCR: నేటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో..

Kcr

Kcr

KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ బస్సుయాత్ర.. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర కొనసాగనుంది. బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం సూర్యాపేట, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం, కొత్తగూడెం, వీణవంక ప్రాంతాల్లో కేసీఆర్‌ బస చేస్తారు. కేసీఆర్ పాల్గొనే ఒక రోడ్‌షోకి మరో రోడ్‌షోకి మధ్య దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంది.

Read also: Mohanlal-Shah Rukh Khan: నేను మీ డాన్స్‌లో సగమే చేశా.. మోహన్‌ లాల్‌పై షారుక్‌ఖాన్‌ ప్రశంసలు!

కాగా.. కేసీఆర్ బస్సు యాత్ర మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేట బహిరంగ సభతో ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు బీఆర్ఎస్ వర్గాలు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ ఉండటంతో.. సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

Read also: Summer Holidays: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. నేటి నుంచి వేసవి సెలవులు..

కేసీఆర్ బస్సు యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు వాహన శ్రేణి వెంట రానున్నారు. ఇప్పటికే ఎంపికైన వారికి తెలంగాణ భవన్‌లో అవగాహన కల్పించారు. ఇవాళ తొలిరోజు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. పార్టీ క్యాడర్, నేతలతో భేటీ అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తొలిరోడ్డు షోలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లనున్నారు. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రజలు పెద్దఎత్తున నిలబడి ప్రసంగాన్ని దూరం నుంచి వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజల్లో భారీ స్పందన వస్తుందని స్పష్టంగా భావిస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర, ప్రసంగాలతో మళ్లీ ప్రజల్లో వెళ్లనుండటంతో బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ పెరిగింది.
Rajini Coolie: లోకేషూ ఏమైందయ్యా నీకు..?