Rajini Coolie: లోకేషూ ఏమైందయ్యా నీకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనగరాజ్ సినిమాలు విభిన్నంగా వుంటూ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించేలా ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌గా చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి.తాజాగా లోకేష్ కనగరాజ్ తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ పవర్ ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ”తలైవార్ 171 ” వర్కింగ్ టైటిల్ తో మొదలైంది .తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పవర్ ప్యాక్డ్ టీజర్ ద్వారా టైటిల్ రివీల్ చేసారు..ఈ చిత్రానికి ”కూలీ” అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.రజనీకాంత్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్‌తో లోకేష్ ఆశించినంత రేంజ్ హైప్ క్రియేట్ చేయలేకపోయాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అసలు తలైవార్ 171 మూవీ అనౌన్స్ అయినప్పుడు ఫ్యాన్స్ లో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి.
రజనీకాంత్ కు డై హార్డ్ ఫ్యాన్ అయినా లోకేష్ తలైవా ను ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు .. పైగా ఈ సినిమాలో రజనీ కాంత్ నెగెటివ్ రోల్ అనే న్యూస్ కూడా బయటికి రావడంతో ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ కు చేరాయి..ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా టైటిల్‌ని ‘కూలీ’గా అనౌన్స్ చేస్తూ.. పవర్ ఫుల్ టీజర్ ను లోకేష్ రిలీజ్ చేశాడు .ఇక రజనీ ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చేలా గోల్డ్‌లా కూలీ టీజర్ మెరిసిపోయింది . బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ మరియు చైన్లతో రజినీ స్టైలిష్ లుక్ అండ్ ఫైట్ అదిరిపోయింది. కానీ కొందరు మాత్రం తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ టీజర్ లేదనే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. విక్రమ్, లియో రేంజ్‌లో కూలీ టైటిల్ టీజర్ కట్ చేయలేదని వారు కామెంట్ చేటున్నారు. గోల్డ్ బ్యాక్ డ్రాప్ బాగున్నా కూడా డైలాగులు అలాగే రజినీ యాక్షన్ మార్క్ కనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా విక్రమ్, లియో టైటిల్ గ్లింప్స్ రేంజ్‌లో కూలీ టీజర్ హైప్ క్రియేట్ చేయలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇది జస్ట్ టీజర్ మాత్రమే ‘కూలీ’ అసలు కథ ముందు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
తాజావార్తలు
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!